హిట్లర్‌లా.. లోకాన్ని పాలించాలని లేదు

by  |
హిట్లర్‌లా.. లోకాన్ని పాలించాలని లేదు
X

న్యూఢిల్లీ: అడాల్ఫ్ హిట్లర్ అనగానే అందరికీ రెండో ప్రపంచయుద్ధం గుర్తొస్తుంది. హోలోకాస్ట్ తలపునకు వస్తే ఆయనపై ఆగ్రహం రెట్టింపవుతుంది. జర్మన్‌లు ఉత్కృష్ట జాతికి చెందినవారని మొదలుపెట్టి రెండో ప్రపంచానికి తెరతీసి యూదులను ఊచకోత కోసిన హిట్లర్.. యావత్ లోకాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలని యత్నించి విఫలమయ్యాడు. ఆయన హయాంలో జర్మనీ కాలనీగా ఉన్న ప్రస్తుత దక్షిణాఫ్రికా దేశం నమీబియాలో మళ్లీ అడాల్ఫ్ హిట్లర్ పేరు చర్చనీయాంశమైంది.

ఒంపుంజా నియోజకవర్గం నుంచి స్థానిక ఎన్నికల్లో స్వీపింగ్ విక్టరీ సాధించిన అడాల్ఫ్ హిట్లర్ ఉనోనా ఇందుకు కేంద్రబిందువు. తనకు నాజీ భావజాలంతో సంబంధం లేదని, ప్రపంచాన్ని పాలించాలన్న కాంక్ష కూడా లేదని అడాల్ఫ్ హిట్లర్ ఉనోనా స్పష్టం చేశారు. తమ దేశంలో హిట్లర్ పేరు కామన్ అని, తన తండ్రి ఈ పేరు పెట్టేటప్పుడు హిట్లర్ నిజస్వరూపం తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. అధికారిక పత్రాల్లో ఈ పేరే చేర్చి ఉండటం వల్ల పేరు మార్చుకోవాలని భావించడం లేదని వివరించారు.


Next Story

Most Viewed