ఆస్తులు అమ్మైనా డిపాజిట్లు చెల్లిస్తా : నౌహీరా షేక్

by Shyam |

<p>దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రూ.5 వేల కోట్ల ఆస్తులను అమ్మైనా సరే, డిపాజిట్లు చేసిన వారి డబ్బును తిరిగి చెల్లిస్తానని హీరాగోల్డ్ కంపెనీ సీఈఓ నౌహీరా షేక్ స్పష్టం చేశారు. హీరా గోల్డ్ కేసులో జైలు నుంచి కండీషన్ బెయిల్‌పై వచ్చిన ఆమె బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో శనివారం విలేకరుల నిర్వహించారు. 1998 పని చేస్తున్న హీరా గ్రూప్‌లో రూ.50 లక్షల ఫ్రాడ్ జరిగిందని, తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని [&hellip;]</p>

Hiragold CEO Nauheera Sheikh
X

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రూ.5 వేల కోట్ల ఆస్తులను అమ్మైనా సరే, డిపాజిట్లు చేసిన వారి డబ్బును తిరిగి చెల్లిస్తానని హీరాగోల్డ్ కంపెనీ సీఈఓ నౌహీరా షేక్ స్పష్టం చేశారు. హీరా గోల్డ్ కేసులో జైలు నుంచి కండీషన్ బెయిల్‌పై వచ్చిన ఆమె బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో శనివారం విలేకరుల నిర్వహించారు. 1998 పని చేస్తున్న హీరా గ్రూప్‌లో రూ.50 లక్షల ఫ్రాడ్ జరిగిందని, తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు. రెండేళ్ల విచారణ కాలంలో కనీసం రూ.50 ల మోసాన్ని కూడా పోలీసులు నిరూపించలేకపోయారని తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగానే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ మేరకు పోలీసు అధికారులకు తీవ్ర ఒత్తిడులు ఉన్నాయని ఆరోపించారు.

2012 నుంచి ఓ ల్యాండ్ వివాదంలో అసదుద్దీన్ ఓవైసీ నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, నాటి నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సుమారు 29 కేసులు నమోదు చేశారని అన్నారు. వ్యాపారంలో ఆడబిడ్డ ఎదగడం జీర్ణించుకోలేకనే అసదుద్దీన్ ఓవైసీ నాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. హీరా కంపెనీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఇన్ కం ట్యాక్స్ చెల్లించామని అన్నారు. హీరా కంపెనీలోని 20 వేల ఉద్యోగులు రెండేళ్లుగా రోడ్డున పడ్డారని అన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసే తమలాంటి వారిపై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని అన్నారు. తాము చేసే వ్యాపారం అంతా.. చట్టబద్ధంగా చేస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.

Next Story