‘హీ’నా.. ‘షీ’నా?

by  |
‘హీ’నా.. ‘షీ’నా?
X

గ్రామీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ప్రియాంక వేసుకున్న డ్రెస్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. విపరీతంగా ట్రోల్స్ చేశారు. దీంతో ప్రియాంక తరపున వకాల్తా పుచ్చుకున్న తల్లి మధు చోప్రా ట్రోల్స్ పై స్పందించింది. నా కూతురు డ్రెస్ బాగుందని, తను కంఫర్ట్‌గా ఫీల్ అయిందని స్పష్టంగా చెప్పింది.

అయినా కూడా ట్రోల్స్ ఆగడం లేదు. ఈసారి ప్రియాంక తరపున మాట్లాడింది బాలీవుడ్ నటి హీనాఖాన్. గ్రామీ అవార్డుల ఫంక్షన్‌కు ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ఆమెకు కంఫర్ట్‌గా ఉన్నప్పుడు.. మీకు ప్రాబ్లమ్ ఏంటి? కామెంట్ చేయడానికి మీరెవరు? అని ప్రశ్నించింది. అంతేకాదు ప్రియాంక వేసుకున్న డ్రెస్ పది నిమిషాలు వేసుకుని చూపించాలని చాలెంజ్ చేసింది. ఆ డ్రెస్ వేసుకోవడం అంత ఈజీ కాదని, అయినా ప్రియాంక ఆ డ్రెస్‌తో అందరినీ మెప్పించిందని కొనియాడింది. ఒకరిని కామెంట్ చేస్తున్నప్పుడు మనం ఏ లెవల్ లో ఉన్నామో చూసుకోవాలంటూ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది హీనా‌ఖాన్.


Next Story

Most Viewed