బట్టలిప్పి హిజ్రా రచ్చ రచ్చ.. ట్రాన్స్‌జెండర్స్ తలదించుకునేలా చేసిన ఘటన..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-23 11:13:18  IST  )

<p>దిశ ప్రతినిధి, మెదక్ : హిజ్రాగా ఉన్నాకూడా ఎన్నో ఉన్నత  శిఖరాలు అధిరోహిస్తూ.. మేమూ ఎందులోను తక్కువకాదు అని నిరూపించుకుంటున్నారు కొందు ట్రాన్స్ జెండర్‌లు. అయితే అలాంటి వారికి తలదించుకునేలా చేసింది ఓ ట్రాన్స్ జెండర్.. సంగారెడ్డి జిల్లాలో ట్రాన్స్ జెండర్ కాసేపు హంగామ సృష్టించింది. షాప్ ఓపెనింగ్ సమయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు బట్టలిప్పి నానా రభస చేసింది. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్ [&hellip;]</p>

బట్టలిప్పి హిజ్రా రచ్చ రచ్చ.. ట్రాన్స్‌జెండర్స్ తలదించుకునేలా చేసిన ఘటన..
X

దిశ ప్రతినిధి, మెదక్ : హిజ్రాగా ఉన్నాకూడా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ.. మేమూ ఎందులోను తక్కువకాదు అని నిరూపించుకుంటున్నారు కొందు ట్రాన్స్ జెండర్‌లు. అయితే అలాంటి వారికి తలదించుకునేలా చేసింది ఓ ట్రాన్స్ జెండర్.. సంగారెడ్డి జిల్లాలో ట్రాన్స్ జెండర్ కాసేపు హంగామ సృష్టించింది. షాప్ ఓపెనింగ్ సమయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు బట్టలిప్పి నానా రభస చేసింది. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రాయపల్లి రోడ్డులో పటేల్ కాలనీకి చెందిన ఎంఏ ఖలీద్ అనే యువకుడు ప్రభుత్వ ఆసుపత్రి గేటు ఎదురుగా ఏకే హోమ్ నీడ్స్ పేరిట షాప్ ఏర్పాటు చేసి సోమవారం ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించాడు.

షాప్ ఓపెనింగ్ చేస్తున్న సమయంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్‌రావుపల్లి తండాకు చెందిన మహాలక్ష్మి అలియాస్ మహేందర్ అనే ట్రాన్స్ జెండర్ దుకాణం వద్దకు చేరుకొని నానా రభస చేసింది. పంజాబీ డ్రెస్ వేసుకొని షాప్‌లోకి అక్రమంగా ప్రవేశించి తాను ట్రాన్స్ జెండర్ అని చెబుతూ తనకు రూ.11 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు తిరస్కరించిన షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదు. దీంతో ట్రాన్స్ జెండర్ నాకు డబ్బులు ఇవ్వకపోతే బట్టలు విప్పి నీ పరువు తీస్తానని బెదిరించగా ఖలీద్ రూ.2 వేలు ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ బట్టలు విప్పి రచ్చ రచ్చ చేసింది. పోలీసు వారికి ఫిర్యాదు చేస్తానని తెలపగా బూతుమాటలు తిడుతూ వెళ్ళిపోయింది. ఈ విషయంపై షాప్ యజమాని ఖలీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.వెంకటరెడ్డి తెలిపారు.

Next Story