- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC జోనల్ కమిషనర్లకు హైకోర్టు షాక్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ కమిషనర్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నగరంలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేతస్థాయిలో నిర్మాణాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. నగరంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఏ మేరకు చర్యలు తీసుకుందో నివేదిక రూపంలో అందజేయాలని బల్దియా పరిధిలోని జోనల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ కమిషనర్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నగరంలో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేతస్థాయిలో నిర్మాణాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది.
నగరంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఏ మేరకు చర్యలు తీసుకుందో నివేదిక రూపంలో అందజేయాలని బల్దియా పరిధిలోని జోనల్ కమిషనర్లను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు కూడా చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15న కోర్టు వాయిదా వేసింది.
Next Story






