జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు షాక్

by  |
జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు షాక్
X

దిశ, ఏపీబ్యూరో: సీఎం జగన్‌పై గతంలో నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణపై హైకోర్టు షాకిచ్చింది. కేసుల ప్రాసిక్యూషన్ ఉపసంహరణను సుమోటోగా తీసుకుంది. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ తీసుకుని కోర్టు విచారణ చేపట్టింది. అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని 11 కేసుల్లో ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంది. అయితే ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు పలువురు ఫిర్యాదు చేశారు.

దీంతో ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది. సుమోటోగా తీసుకున్న అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సుమోటో కేసుపై హైకోర్టు ఏజీ వాదనలు వినిపించారు. క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను తీసుకోవడం దేశంలోనే ప్రథమం అని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.



Next Story

Most Viewed