- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ గేట్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో సీపీఎం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ గేట్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో సీపీఎం నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు మంత్రి బొత్స తమకు అనుకూల మీడియాకి మాత్రమే అనుమతించి ఇతర మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంతో.. మీడియా ప్రతినిధులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






