హైటెక్ సిటీలో ఫ్యామిలీ సెలూన్‌ పేరుతో వ్యభిచారం..10 మంది యువతులు..

by  |
హైటెక్ సిటీలో ఫ్యామిలీ సెలూన్‌ పేరుతో వ్యభిచారం..10 మంది యువతులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : మసాజ్ సెంటర్ల మాటున అసాంఘిక కార్యక్రమాలు మితిమీరి పోతున్నాయి. బయటకు మాత్రం మసాజ్ సెంటర్ అని బోర్డు.. లోపల మాత్రం అందమైన స్వదేశీ, విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.

తాజాగా హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ ప్రాంతంలో గుట్టుగా మసాజ్ సెంటర్ మాటును వ్యభిచారం సాగుతున్న వ్యవహారాన్ని ఆదివారం మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్ అడ్డగా పేరున్న మాదాపూర్‌ కావూరి హిల్స్‌ కాలనీలో ఉన్న ఎన్‌స్కేర్‌ బిల్డింగ్‌లో.. హెవెన్‌ స్పా అండ్‌ ఫ్యామిలీ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు.

అయితే స్పా మాటున అక్కడ వ్యభిచారం జరుపుతున్నారన్న పక్కా సమచారంతో ఆదివారం రాత్రి పోలీసులు సెలూన్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో 10 మంది యువతులను, ఏడుగురు విటులను, స్పా నిర్వాహకుడు చిట్టిబాబు, అతడి అనుచరులు ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.73 వేల నగదు, 28 సెల్‌ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్‌, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed