ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణల కమిటీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం నిపుణుల కమిటీ [&hellip;]</p>

ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణల కమిటీ
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు ప్రపంచబ్యాంకు నిధులతో అమలవుతున్న ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యాకానుక అమలు అంశాలపైనా చర్చించారు. 2021-22 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ తయారీ, పాఠశాలలను తెరిచే అంశంపైనా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌, థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన విధివిధానాలపై కూలంకుషంగా చర్చించారు.

Next Story