- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు..
by Shyam |
<p>దిశ, జడ్చర్ల: ఉప సర్పంచ్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ లక్ష్మీ మల్లేష్ పై ఇటీవల గ్రామ సర్పంచ్ సునీత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఉప సర్పంచ్ లక్ష్మి మల్లేష్ అవిశ్వాస తీర్మానం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషనర్ లక్ష్మీ మల్లేష్ దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు అయ్యవారిపల్లి ఉప సర్పంచ్ లక్ష్మీ మల్లేష్ పై […]</p>

X
దిశ, జడ్చర్ల: ఉప సర్పంచ్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ లక్ష్మీ మల్లేష్ పై ఇటీవల గ్రామ సర్పంచ్ సునీత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఉప సర్పంచ్ లక్ష్మి మల్లేష్ అవిశ్వాస తీర్మానం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో పిటిషనర్ లక్ష్మీ మల్లేష్ దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు అయ్యవారిపల్లి ఉప సర్పంచ్ లక్ష్మీ మల్లేష్ పై గ్రామ సర్పంచ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నిలిపివేయాలని సంబంధిత జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులను సోమవారం ఉప సర్పంచ్ సంఘం నాయకులు శ్రీను నాయక్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి లక్ష్మి మల్లేష్, డీఎల్‌పీఓ వరలక్ష్మికి కోర్టు ఆర్డర్ కాపీని అందజేశారు.
Next Story






