‘బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసులే కారణం’

by  |
‘బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసులే కారణం’
X

దిశ, హైదరాబాద్: బీఫార్మసి విద్యార్థిని ఆత్మహత్య కేసుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులే ఆమె చావుకి కారణమంటూ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. విద్యార్థిని జీవించేహక్కు కోల్పోయేలా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్, అత్యాచారం ఘటన అంటూ మీడియా ముందు ప్రకటనలు చేయడం, తర్వాత పోలీసులను తప్పదోవ పట్టిచిందంటూ వారే స్టేట్‌మెంట్‌ ఇవ్వడం, పోలీసులే కోర్టు తీర్పులివ్వడంతోనే విద్యార్థిని కృంగిపోయిందన్నారు. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. ఇదే సమయంలో యువతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో వెల్లడించారు.

ఆటోడ్రైవర్లే ముద్దాయిలు అని తొలుత ప్రకటించి.. ఆ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలు బయటకు వెల్లడించడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ పెరిగాయన్నారు. ఇటువంటి పరిణామాలను భరించలేకనే షుగర్ టాబ్లెట్లను వేసుకొని ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులు ఎవరని నిలదీశారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. కోర్టు చేసే పనులు కోర్టులే చేసేలా సీఎస్, డీజీపీలను హెచ్‌ఆర్సీ ఆదేశించాలని ఆయన చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed