- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో గెస్ట్ హౌస్ : హైకోర్టు కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. గెస్ట్‌హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో ఉన్న చెట్లు నరకవద్దని, అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేహౌండ్స్‌కు ఇచ్చిన స్థలంలో అతిథిగృహం సరికాదని పిటిషనర్ తరపు […]</p>

X
దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. గెస్ట్‌హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో ఉన్న చెట్లు నరకవద్దని, అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేహౌండ్స్‌కు ఇచ్చిన స్థలంలో అతిథిగృహం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
Next Story






