పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

by  |
పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: మెడికల్, దంత వైద్య పీజీ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ చేపట్టింది. ‘ఏ’ కేటగిరీ విద్యార్థులు యాభై శాతం, ‘బి’ కేటగిరీ విద్యార్థులు 60 శాతం చొప్పున ఫీజు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు మాత్రం పూర్తి ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇవి మధ్యంతర ఉత్తర్వులే కనుక విద్యార్థులు చేస్తున్న ఫీజు చెల్లింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ఫీజు రెగ్యులేటరీ కమిటీకి, వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా సంక్షోభం సమయంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story