కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు !

by  |
కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: నీలోఫర్ ఆస్పత్రిలో భోజనం కాంట్రాక్టర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలన్న పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంట్రాక్టర్ సురేశ్‌పై విచారణ నివేదికను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హైకోర్టుకు సమర్పించారు. తప్పుడు బిల్లులో నిధులు దుర్వినియోగం చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. అయితే అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్‌ను గాంధీ, ఛాతి ఆస్పత్రుల్లో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు కోసుకోలేదని ప్రశ్నించింది. రెండువారాల్లో అతనిపై చర్యలు తీసువాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేసును సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.



Next Story

Most Viewed