- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LRS లొల్లి.. హైకోర్టు సంచలన తీర్పు!
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్ఎస్ విధానం వలన అటు రైతులతో సహా ఇటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. LRSను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇన్ని రోజులు భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పుతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతులిస్తూ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, కేవలం వ్యవసాయేతర భూములకు మాత్రమే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్ఎస్ విధానం వలన అటు రైతులతో సహా ఇటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. LRSను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇన్ని రోజులు భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పుతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతులిస్తూ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, కేవలం వ్యవసాయేతర భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
Next Story






