- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా ఆదేశాలు అమలుకావడంలేదు
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టంగా ఏం చేయాలో చెప్పినా ఒక్కదాన్ని కూడా పాటించడంలేదని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 8వ తేదీ నుంచి కరోనా విషయంలో ఎన్నో ఉత్తర్వులను, ఆదేశాలను జారీ చేశామని, వాటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టంగా ఏం చేయాలో చెప్పినా ఒక్కదాన్ని కూడా పాటించడంలేదని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 8వ తేదీ నుంచి కరోనా విషయంలో ఎన్నో ఉత్తర్వులను, ఆదేశాలను జారీ చేశామని, వాటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది.
హైకోర్టు జారీచేస్తున్న ఆదేశాలను అమలుచేయడం సాధ్యంకాకపోతే ఎందువల్ల సాధ్యంకావడంలేదో అనే విషయాన్ని స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బులెటిన్‌లో ఏయే అంశాలు ఉండాలో, దాని ద్వారా ప్రజలకు ఎలాంటి సమాచారం అందాలో ప్రభుత్వానికి చాలాసార్లు వివరించిందని, అయినా తాజాగా ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో సైతం అలాంటి వివరాలు లేవని తప్పుపట్టింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పాటించనందున మంగళవారం జరిగే విచారణకు ఎలాగూ నేరుగా ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్యా విభాగం డైరెక్టర్ తదితరులు హాజరవుతారు కాబట్టి వారినే అడిగి తేల్చుంటామని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ హాజరయ్యారు. మంగళవారం విచారణకు ఈ నలుగురూ హాజరుకావాల్సి ఉంది.






