దళితబంధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. హై టెన్షన్‌కు ముగింపు

by  |
దళితబంధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. హై టెన్షన్‌కు ముగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను గురువారం హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అయితే, హుజురాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో దళిత బంధును అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై తాజాగా హైకోర్టు ధర్మాసనం పై కామెంట్స్ చేసింది.


Next Story

Most Viewed