హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

128
High-Court-Chief-Justice

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బీబీ హరిచందన్.. ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు రాష్ట్రమంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, సీఎస్ సమీర్ శర్మ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, హైకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బీబీ హరిచందన్‌లు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..