విశాఖలో ఉద్రిక్తత

31

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడో పట్టణ పీఎస్ సమీపంలో రోడ్డు పక్క నిర్మించిన షాపులను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. షాపుల తొలగింపుపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ షాపులను ఎలా తొలగిస్తున్నారంటూ బాధితులు జీవీఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.