బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్ట్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాముడి విగ్రహాల ధ్వంసం ఘటనకు నిరసనగా.. నేడు బీజేపీ, జనసేన నేతలు రామతీర్థ ధర్మయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే గుంటూరులోని ఆయన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరరావును గృహనిర్భంధం చేశారు. కాగా, మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ పోలీసుల సహయంతో ప్రతిపక్షాల గొంతు [&hellip;]</p>

బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాముడి విగ్రహాల ధ్వంసం ఘటనకు నిరసనగా.. నేడు బీజేపీ, జనసేన నేతలు రామతీర్థ ధర్మయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే గుంటూరులోని ఆయన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరరావును గృహనిర్భంధం చేశారు. కాగా, మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ పోలీసుల సహయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story