- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గమ్మను దర్శించుకున్న హీరోయిన్ శ్రియ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను సినీ నటి శ్రియ శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో రెండో రోజు విదియ శుక్రవారం బాలా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రియ అమ్మవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తాను దుర్గమ్మను కోరుకున్నట్లు శ్రియ తెలిపారు. రెండోరోజు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మెుదటిరోజుతో పోల్చుకుంటే రెండోరోజు భక్తుల […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను సినీ నటి శ్రియ శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో రెండో రోజు విదియ శుక్రవారం బాలా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రియ అమ్మవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తాను దుర్గమ్మను కోరుకున్నట్లు శ్రియ తెలిపారు. రెండోరోజు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మెుదటిరోజుతో పోల్చుకుంటే రెండోరోజు భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
- Tags
- Durgamma
Next Story






