ప్రతి రోజూ అదే కావాలంటున్న టాలీవుడ్ హీరోయిన్

by  |
ప్రతి రోజూ అదే కావాలంటున్న టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ల్లో ఫిట్ నెస్ ఫ్రీక్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అని తడుముకోకుండా చెప్పేస్తారు. రోజులో సగం మొత్తం అమ్మడు జిమ్ లోనే గడుపుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక భారీ భారీ కసరత్తులతో పాటు, మనసుకు ప్రశాంతతనిచ్చే యోగా, శరీరాన్ని ఆహ్లాదపరిచే స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఫిట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు కొంచెం బొద్దుగా ముద్ద మందారంలా ఉండే రకుల్ కాస్తా జీరో సైజు నడుముతో సన్నజాజి తీగలా మారిపోయింది.

అయితే అమ్మడి అదిరిపోయే బాడీ షేప్ కి కారణం స్విమ్మింగేనంటా.. తాను ఇంత ఫిట్ నెస్ గా, అందంగా కనిపించడానికి వర్క్ అవుట్స్, యోగా కన్నా స్విమ్మింగే ఎక్కువ ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. ఉదయం జిమ్ లో చెమటలు చిందించి, ఆ తర్వాత యోగాతో మనసును ప్రశాంతంగా మార్చుకొని స్విమ్మింగ్ పూల్ లోకి అమాంతం దూకేస్తానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి రోజు యోగా, జిమ్ లేకుండా అయినా ఉంటానేమో కానీ స్విమ్ చేయకుండా ఉండలేనంటుంది. ఇకపోతే రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా తో కలిసి ‘డాక్టర్ జీ’ చిత్రంలో నటిస్తుంది.


Next Story

Most Viewed