న్యూడ్ పిక్ అడిగిన నెటిజన్.. ఆ ప్రాంతం చూపించిన పూజ హెగ్డే

by  |
న్యూడ్ పిక్ అడిగిన నెటిజన్.. ఆ ప్రాంతం చూపించిన పూజ హెగ్డే
X

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఏ మాత్రం టైమ్ దొరికినా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పోస్ట్ ఏ ఫొటో ఆఫ్’ ట్రెండ్ కాన్సెప్ట్ మీద అభిమానులతో ముచ్చటించింది. ఈ కాన్సెప్ట్‌‌ ప్రకారం ఫ్యాన్స్ అడిగిన ఫొటోలను పూజ తన పర్సనల్ ఆల్బమ్ నుంచి షేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ట్రెండీ కాన్సెప్ట్ మీద ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పటికీ, పూజ మాత్రం వారెవరూ చూడలేని ఒక వెరైటీ ఎక్స్‌పీరియన్స్‌ను చవిచూసింది. కారణమేంటని అనుకుంటున్నారా? ఓ నెటిజన్ నగ్నంగా ఉన్న తన ఫొటో షేర్ చేయమని అడగడం. కానీ స్మార్ట్ పూజ దీనిపై స్మార్టెస్ట్ రిప్లై ఇవ్వడం విశేషం. ‘నగ్నంగా ఉన్న కాళ్ల ఫొటో’ షేర్ చేసి.. ఇలాంటి మైండ్‌లెస్ రిక్వెస్ట్‌లు పెడితే సమాధానం ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పేసింది.

ఇక ఈ ఇంటరాక్షన్‌లో.. పూజ స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న బికినీ పిక్చర్, ‘అల వైకుంఠపురంలో’ సెట్స్‌లోని తన బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్, బెడ్ మీద లేజీగా ఉన్న ఫొటో, మేకప్ లేకుండా బర్గర్ తింటున్న పిక్చర్ షేర్ చేసింది. ఇక ‘అరవింద సమేత’ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పిక్ షేర్ చేయమని ఓ అభిమాని పూజను కోరగా.. జూ. జూనియర్ ఎన్టీఆర్ అంటూ తారక్ తనయుడు అభయ్ రామ్‌తో ఆడుకుంటున్న క్యూట్ పిక్ షేర్ చేసింది. అప్పుడు హేర్ స్ప్రేనే మా ఆట వస్తువుగా ఉండేదని ఫొటో గురించి వివరించింది పూజ.



Next Story

Most Viewed