హీరోయిన్ ని తమతో గడపమని బలవంతం చేసిన డైరెక్టర్, హీరో.. అర్ధరాత్రి రూమ్ కి వచ్చి

by  |
హీరోయిన్ ని తమతో గడపమని బలవంతం చేసిన డైరెక్టర్, హీరో.. అర్ధరాత్రి రూమ్ కి వచ్చి
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఈ రంగంలో రాణించాలంటే ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను దాటుకొని రావాలి. చాలామంది స్టార్ లు ఎన్నో కష్టాలను అనుభవించే పైకి వచ్చారు. ముఖ్యంగా ఈ గ్లామర్ రంగంలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాస్టింగ్ కౌచ్ లు, కమిట్ మెంట్ లు అంటూ ఎన్నో ఎదుర్కోవాల్సివస్తోంది. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడిన ఇబ్బందులను, బాధలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని, అంతకంటే దారుణమైన సంఘటనలను కూడా చూసినట్లు చెప్పుకొచ్చింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, అతడి కొడుకు లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు అత్యంత నీచంగా ప్రవర్తిస్తూ తమతో గడపమని బలవంతం చేశారని హీరోయిన్ నేహా సక్సేనా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నేహా ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను ఒక తమిళ సినిమా చేసేటప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానని, వారు తనతో చాలా నీచంగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది. “దర్శకుడు చిత్రీకరణ సమయంలో పలు సార్లు ఫిజికల్ గా నాపై దాడి చేశాడు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఏదో ఒక విషయంలో నాతో ఆయన అసభ్యంగా మాట్లాడుతూనే ఉండేవాడు. ఆ సినిమా హీరో దర్శకుడి కొడుకే.. దీంతో వారిద్దరు నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఒకరోజు షూటింగ్ తరువాత హోటల్ రూమ్ లో ఉండగా అర్ధరాత్రి హోటల్ ఓనర్ వచ్చి నాతో చాలా నీచంగా మాట్లాడాడు. ఆ సమయంలో దర్శకుడికి ఫోన్ చేసి చెప్తే.. ఆయన వెటకారంగా మాట్లాడాడు.. ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు.. ఒక్కరోజే కదా అంటూ నీచంగా మాట్లాడాడు. ఆ సినిమా చేసినన్ని రోజులు నరకం చూశాను. దర్శకుడు మాట వినకపోతే చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. ఒకసారి నన్ను మెట్లపై నుంచి తోసేసి, గొంతు పట్టుకొని.. చెప్పింది చేయకపోతే నీకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరించాడు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన పదేళ్ల సినీ కెరీర్ లో అలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురు కాలేదని, తనపై జరిగిన భౌతిక దాడి మరియు లైంగిక వేదింపులకు సంబంధించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ దర్శకుడు ఎవరు..? ఆ హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed