పబ్లిక్ ప్లేస్ లో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్..

by  |
kollywood news
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల వ్యవహర శైలిపై ఎన్నో ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇక షూటింగ్ సమయంలో వారు చేసే ఓవర్ యాక్షన్ ని భరించలేకపోయామని కొంతమంది దర్శకులు బాహాటంగానే బయటపడ్డారు. ఇక తాజగా ప్రముఖ తమిళ నటి మీరా మిథున్‌ వ్యవహర శైలి పై దర్శకుడు గుర్రుమన్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. బిగ్‌బాస్‌ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్‌ బిహేవియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే ఈ భామ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

మీరా ప్రస్తుతం ‘పేయైు కాణోమ్‌’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఓ నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ షూటింగ్ లో మీరా సిగరెట్ తాగుతూ కనిపించడం సంచలనంగా మారింది. షూట్ అయిపోయాక ఒక పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతూ కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. సాధారణంగానే సిగరెట్‌ తాగే అలవాటు ఉన్న మీరా, ఇటీవల షూటింగ్‌ లొకేషన్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కడంపై దర్శకుడు కాస్త అసహనం వ్యక్తం చేశాడట. “సిగరెట్‌ తాగడం అనేది ఆమె పర్సనల్ విషయం.. దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ , షూటింగ్‌ లొకేషన్‌లోనే అలా సిగరెట్లు తాగడం సరికాదని, కేరవాన్‌లో తాగి రావాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఇది రిపీట్‌ చేయలేదని సదరు దర్శకుడు తెలిపారు. ఏది ఏమైనా హాట్ బ్యూటీ అలవాట్లు కొంచెం ఘాటుగానే ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed