నమ్మించి మరీ నాయికపై దాడి చేసిన నెమలి..!

by  |
Digangana Suryavanshi
X

దిశ, సినిమా: హీరోయిన్ దిగంగనా సూర్యవంశీపై నెమలి అటాక్ చేసిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ పార్క్‌కు వెళ్లిన దిగంగన సంకోచిస్తూనే నెమలికి దగ్గరగా వెళ్లింది. అలా సమీపించిన కొద్ది సేపటికే పికాక్ గాల్లోకి ఎగిరి ఆమెపై దాడి చేసింది. దీంతో భయపడిపోయిన భామ కేకలు పెట్టింది. ఈ వీడియోను ఓ కెమెరామెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఓవరాక్షన్ చేస్తే అటాక్ చేయక ఏం చేస్తాయని కొందరు అంటుంటే.. నెమళ్లు ప్రైవసీ కోరుకుంటాయని, డిస్టర్బ్ చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్తున్నారు. కార్తీకేయ ‘హిప్పీ’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో కార్తికేయకు బెస్ట్‌ పార్ట్‌నర్ అనిపించుకున్న భామ తన అందం, నటనతో మంచి గుర్తింపు పొందింది. ఈ భామ గోపీచంద్ హీరోగా వస్తున్న ‘సీటీమార్‌’లో కీలకపాత్రలో కనిపించబోతోంది.



Next Story

Most Viewed