‘మహా ప్రస్థానం’తో టాలీవుడ్ హీరో మరో ప్రస్థానం

by  |
Maha Prasthanam
X

దిశ, సినిమా: తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. బిగ్ బాస్ సీజన్ 2లో కనిపించిన తనీష్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తుండగా.. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో మరో ప్రస్థానం మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌‌‌కు వచ్చిన స్పందనతో మూవీ సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్.. ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా ‘మహా ప్రస్థానం’ ఉంటుందని చెప్పిన దర్శకుడు.. సింగిల్ షాట్ ప్యాటర్న్‌లో ఎలాంటి కట్స్ లేకుండా చిత్రాన్ని తెరకెక్కించామని వెల్లడించారు. ఈ విధానం థియేటర్‌లో ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ కథానాయిక కాగా, వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన చిత్రానికి ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Next Story

Most Viewed