ఇండియా మరో ఇటలీ కారాదు: సూర్య

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మరో ఇటలీ కాకుండా జాగ్రత్తపడదామన్నాడు హీరో సూర్య. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించాడు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని&#8230; ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరాడు. చైనాలో కరోనా విలయతాండవం చేసినప్పుడు ఇటలీ ప్రజలు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే &#8230; చైనా కంటే ఇటలీలోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకే భారత ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. జల్లికట్టు, వరదలు, తుఫాన్ లాంటి విషయంలో [&hellip;]</p>

ఇండియా మరో ఇటలీ కారాదు: సూర్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మరో ఇటలీ కాకుండా జాగ్రత్తపడదామన్నాడు హీరో సూర్య. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించాడు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని… ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరాడు. చైనాలో కరోనా విలయతాండవం చేసినప్పుడు ఇటలీ ప్రజలు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే … చైనా కంటే ఇటలీలోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకే భారత ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. జల్లికట్టు, వరదలు, తుఫాన్ లాంటి విషయంలో రోడ్డెక్కి పోరాడిన మనం.. ఇంట్లోనే ఉండి కరోనాపై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇంట్లో ఉంటూ తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు సూర్య. ముఖాన్ని చేతులతో ముట్టుకోరాదన్నారు. జలుబు, దగ్గుతో బాధపడితే భయపడిపోవద్దని.. ఆ లక్షణాలు ఉంటే కరోనా వచ్చినట్లు కాదని.. కానీ ఇతరులకు కొంచెం దూరంగా ఉండడం మంచిదన్నారు. ఆరు రోజుల వరకు కూడా తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.


Tags: Surya, Tamil Actor, CoronaVirus, Covid19

Next Story