హీరో సూర్య హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన కార్తీ

by  |
హీరో సూర్య హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన కార్తీ
X

దిశ, సినిమా: హీరో సూర్య కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తన తమ్ముడు హీరో కార్తీ అభిమానులతో పంచుకున్నారు. ‘అన్నయ్య పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చాడు.. కొన్ని రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటాడు’ అని తెలుపుతూ ట్వీట్ చేశారు. సూర్య ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో.. ఇంత మంచి న్యూస్ షేర్ చేసిన కార్తీకి ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు.

కాగా, హీరో సూర్య రెండ్రోజుల క్రితం తాను కొవిడ్ పాజిటివ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానని.. తనకు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తున్న డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పరిస్థితులు నార్మల్ కాలేదని.. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిమానులకు సూచించారు.


Next Story

Most Viewed