జనసేనానితో హీరో సుదీప్ భేటీ

by  |
జనసేనానితో హీరో సుదీప్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కన్నడ హీరో సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సుదీప్ వచ్చారు. ఈ సందర్భంగా జనసేనానికి ఆయన మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది.

కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్, పవన్ కి వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

Next Story

Most Viewed