హీరో రామ్ రూ.25లక్షల సాయం..

by  |
హీరో రామ్ రూ.25లక్షల సాయం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కురసిన భారీ వర్షాలన వలన వరదలు పొటెత్తాయి. దీంతో నగరం మొత్తం జలదిగ్భంధం చిక్కుకుపోయింది. తీవ్రంగా నష్టపోయిన నగరాన్ని, పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సాయం చేయాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే చాలా మంది తమకు తోచిన కాడికి సాయం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే యువ కథానాయకుడు రామ్ పోతినేని తన వంతుగా రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన రామ్ రూ.25 లక్షల చెక్‌ను ఆయనకు అందజేశారు. రామ్ అందించిన సాయం పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed