రామగుండంలో రెబల్ స్టార్ ప్రభాస్

by  |
రామగుండంలో రెబల్ స్టార్ ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’పై అభిమానులకు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ‘కేజీఎఫ్’ మేకర్స్ నుంచి వస్తున్న సినిమాకు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటం.. మోస్ట్ వయొలెంట్ ‘సలార్’ అంటూ ప్రభాస్ వయొలెంట్ లుక్‌, టైటిల్ రివీల్ చేయడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, ఈ చిత్రం షూటింగ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. అది కూడా తెలంగాణలోని రామగుండం ప్రాంతంలోని బొగ్గు గనుల్లో కావడం విశేషం.

ఇప్పటికే మూవీ యూనిట్ కొందరు అక్కడకు చేరుకుని షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా..తాజాగా ప్రభాస్ రామగుండం చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు, ప్రత్యేక రక్షణ బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన పాన్ ఇండియా స్టార్.. ఆ తర్వాత ‘సలార్’ ఫిల్మింగ్ జరగనున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గని -2 ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్రభాస్ రాకతో అభిమానులు భారీ సంఖ్యలో తరలిరాగా.. ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

Next Story