హీరో నిఖిల్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఫ్యాన్స్ ఫైర్

by  |
nikhil siddharth
X

దిశ, సినిమా: కరోనా కారణంగా లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్‌లో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న హీరో నిఖిల్‌ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎంతో మంది బాధితులకు ఆర్థికంగా హెల్ప్ చేయడంతో పాటు వైద్యపరమైన సహాయం అందింస్తున్నాడు నిఖిల్‌. ఇదే క్రమంలో ఉప్పల్ నుండి మినిస్టర్ రోడ్‌ కిమ్స్‌కు ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ మందులను అందించేందుకు వెళ్తున్నపుడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నిఖిల్ రోగి వివరాలు, ప్రిస్క్రిప్షన్ అందించినా దారి ఇవ్వలేదని, ఈ పాస్ అడుగుతున్నారని ట్వీట్ చేశాడు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తనను వెళ్లనివ్వాలని ఎన్నిసార్లు అడిగినా సరే పర్మిషన్ ఇవ్వలేదని వివరించాడు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ప్రభుత్వం అనుమతించాలని కోరాడు. ఈ ట్వీట్‌తో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోడ్డుమీద గాలికి తిరిగేవారిపై ప్రతాపం చూపించని పోలీసులు.. సహాయం చేసే వాళ్లను మాత్రం ఆపేందుకు ముందుంటారని మండిపడుతున్నారు.

Next Story

Most Viewed