- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెప్టెంబర్ 18 నుంచి #NS20 షూటింగ్ ప్రారంభం
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న #NS20 షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ జరుగుతుదని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న #NS20 షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ జరుగుతుదని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించనున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్‌లో నాగశౌర్య నిల్చొని ఉన్న స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈరోజు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న స్టిల్‌ను రిలీజ్ చేశారు. సరికొత్తగా కనిపిస్తోన్న నాగశౌర్య లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య విలుకాడుగా కనిపించనున్నారు.






