బైక్‌ల ధరలు పెంచిన హీరో మోటోకార్ప్!

74
Hero MotoCorp

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గురువారం తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గత కొన్ని నెలలుగా వివిధ పరికరాల ధరలు పెరిగిపోతుండటంతో వాహనాల ధరలను పెంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల వేరియంట్‌ని బట్టి ధరల పెంపు రూ. 3,000 వరకు ఉంటుందని, ఈ పెరుగుదల మోడల్‌ను బట్టి మారుతుందని కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది.

వాహనాల తయారీకి వాడే పలు రకాల విడిభాగాల వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో పండుగ సీజన్ అయినప్పటికీ వాహనాల ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీ అభిప్రాయపడింది. అయితే, పండుగ సీజన్‌లో డిమాండ్ ఆశించిన స్థాయిలోనే ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ తొలి ఐదు నెలల కాలంలో మొత్తం 18 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గతేడాది నమోదైన దానికంటే 12 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..