‘బసవతారకం’లో హీరో బాలకృష్ణ పూజలు

by  |
Balakrishna
X

దిశ, తెలంగాణ బ్యూరో : గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్ లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన పూజలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. పూజలో డాక్టర్లు ఆర్.వీ ప్రభాకర రావు, ఫణి కోటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్, ఇతర వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed