- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో బాలకృష్ణ భార్య సంతకం ఫోర్జరీ
by Shyam |
<p> ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ అయింది. మొబైల్ బ్యాంకింగ్ ఆప్లికేషన్ కోసం వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అసిస్టెంట్ కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్, బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్‌లు వసుంధర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి, వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయమంటారా? అని అడిగారు. దీంతో తాము మొబైల్ బ్యాంకింగ్ […]</p>

X
ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ అయింది. మొబైల్ బ్యాంకింగ్ ఆప్లికేషన్ కోసం వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అసిస్టెంట్ కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్, బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్‌లు వసుంధర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి, వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయమంటారా? అని అడిగారు. దీంతో తాము మొబైల్ బ్యాంకింగ్ కోసం ఆప్లికేషనే ఇవ్వలేదన్నారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు బ్యాంకులో విచారించగా, కొత్తగా చేరిన శివ ఈ పని చేసినట్టు తేలింది. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై క్రిమినల్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
Next Story






