బాలకృష్ణకు సినీ ప్రముఖుల కృతజ్ఞతలు.. కారణం ఇదే!

by  |
బాలకృష్ణకు సినీ ప్రముఖుల కృతజ్ఞతలు.. కారణం ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ :
హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలుపుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కారణం ఎంటంటే.. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు హోమియోపతి పిల్స్ ఉపయోగపడతాయని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తన సన్నిహితులకు, సినీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ హోమియో పిల్స్ పంపిస్తున్నారు. తాజాగా, బాలకృష్ణ తనకు కూడా హోమియా పిల్స్, విటమిన్ ట్యాబ్లెట్లను పంపారని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ వెల్లడించారు. తనకే కాకుండా చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అందరికీ ఈ మెడిసిన్ పంపిస్తున్నారని చెప్పారు. తనను గుర్తుంచుకుని మరీ మెడిసిన్ పంపించినందుకు హీరో బాలయ్య బాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని డైరక్టర్ వీవీ వినాయక్ తెలిపారు.


Next Story

Most Viewed