చలించిన బాలయ్య.. భారీగా విరాళం

84

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో ప్రజల అవస్థలను చూసి చలించిపోయిన హీరో బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 1.50 కోట్ల విరాళం ప్రకటించారు. అటు ఆదివారం సాయంత్రం పాతబస్తీకి బసవతారక రామా సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్లను పంపించారు. ఇప్పటివరకు వరదలపై ఏ హీరో స్పందించకున్నా మొట్టమొదటగా విరాళం అందజేయడం పట్ల బాలయ్య ఫ్యాన్స్, తెలుగు ప్రజలు అభినందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ సినీ కార్మికుల కోసం బాలకృష్ణ విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.