రీల్ కాదు రియల్: గోల్డ్ మెడల్ సాధించిన హీరో అజిత్

by  |
రీల్ కాదు రియల్: గోల్డ్ మెడల్ సాధించిన హీరో అజిత్
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ సైకిల్ రైడ్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. చెన్నై నుంచి కోల్‌కతా వరకు సైకిల్ రైడ్ చేసి సోషల్ మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ అయిన అజిత్..ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. షూటింగ్, కారు రేసింగ్ లాంటి స్పోర్ట్స్‌లోనూ ప్రొఫెషనల్ అయిన మల్టీటాలెండ్ అజిత్..46వ తమిళనాడు స్టేట్ షూటింగ్ చాంపియన్ షిప్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.

చెన్నై రైఫిల్ క్లబ్‌ను రెప్రజెంట్ చేస్తూ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న అజిత్ ఏకంగా ఆరు మెడల్స్ సాధించడం విశేషం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, స్నేహితులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎయిర్ పిస్టల్ 10మీ(ఐఎస్ఎస్ఎఫ్), సెంటర్ ఫైర్ పిస్టల్ .32(ఐఎస్ఎస్ఎఫ్) 25 మీ, సెంటర్ ఫైర్ పిస్టల్ .32(ఎన్ఆర్) 25మీ, స్టాండర్డ్ పిస్టల్ .22(ఐఎస్ఎస్ఎఫ్) 25మీ, స్టాండర్డ్ పిస్టల్ .22(ఎన్ఆర్)25మీ, ఫ్రీ పిస్టల్ .22(ఎన్ఆర్) 50మీ కేటగిరిల్లో మెడల్స్ గెలుచుకున్నారు అజిత్.

Next Story