గ్యాస్‎ట్రబుల్ రావడానికి గల కారణాలివే..!

by  |
గ్యాస్‎ట్రబుల్ రావడానికి గల కారణాలివే..!
X

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన పలు రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి. ఈ లక్షణాలు అందరి వయసులోనూ ఒకే విధంగా ఉండవు. ఇంతకు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది.? ఇది రావడానికి గల కారణాలెంటో తెలుసుకుందాం.

కారణాలు:
సాధారణంగా గ్యాస్ ట్రబుల్ సుమారు 70 శాతం మందిలో, ముఖ్యంగా నలభై ఏళ్లలోపు వారికి సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాఫీ, టీ, మసాలాలు, ఆసిడిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నియమిత వేళల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జీర్ణకోశంలో ఇన్ ఫెక్షన్లు వంటి కారణాలు గ్యాస్ ట్రబుల్ రావడానికి అవకాశాలున్నాయి. బీన్సు, చిక్కుళ్లు, క్యాబేజి, కాలిఫ్లవర్‌, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూర గాయలు, ద్రాక్ష, యాపిల్‌ వంటి పండ్లను అధికంగా సేవించడం వల్ల గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య జటిలమవుతుంది. సీసం, ఆర్సెనిక్‌, పాద‌ర‌సం వంటి భారీ లోహాల‌తో క‌లుషిత‌మ‌మైన నీటిని తాగ‌డం, కలుషితమైన సీఫుడ్ తినడం వ‌ల్ల కూడా గ్యాస్ ట్ర‌బుల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

లక్షణాలు:
ఛాతిలో మంట, నీటి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం, నోటిలో నీళ్లు ఊరడం, చర్మం పొడి బారడం మొదలైన లక్షణాలు ఉన్నాయి. కడుపు ఉబ్బరంతో ఉదర భాగం బిగదీసుకుపోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. దీనినే వైద్య భాషలో లక్షణ సమూహాన్ని డిస్పెప్సియా లేదా నాన్ అల్సర్ డిస్పెన్సియా అంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య చిన్న‌పిల్ల‌ల్లో ఉన్న‌ట్ల‌యితే టాయిలెట్‌కు త‌క్కువ‌గా వెళ్తుంటారు. ఎక్కువ‌గా దాహం, నోరు ఎండిపోవ‌డం, చ‌ర్మం పొడిబార‌డం, క‌డుపు ఫ్లూ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను వెంటనే సంప్రదించాలి.

గ్యాస్ ట్రబుల్ సమస్య రాకుండే ఉండేందుకు వాకింగ్‌, రన్నింగ్‌, స్కిప్పింగ్‌ లాంటి ఆటలు, శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకే సారి ఆహారం తీసుకోకుండా ఉండడం, నీరు తరచుగా తాగుతుండడం, యోగ, ధ్యానం మొదలైనవి చేయాలి.

Heart attack:మీ గుండె జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ ఎలా వస్తుందంటే

పెరుగు అన్నం తిన్న తర్వాత, ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త


Next Story