మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలను పాటిస్తే ఆ ప్రాబ్లం పరార్..

by  |
మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలను పాటిస్తే ఆ ప్రాబ్లం పరార్..
X

అందరినీ వెంటాడే సమస్యలలో మలబద్ధకం ఒకటి. ఆధునిక జీవన విధానం కారణంగా ఈ సమస్య

ఈ రోజుల్లో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఈ కింది చిట్కాలు పాటించండి

అందరినీ వెంటాడే సమస్యలలో మలబద్ధకం ఒకటి. ఆధునిక జీవన విధానం కారణంగా ఈ సమస్య ఈ రోజుల్లో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య ఉన్న పిల్లలు మిగతా చిన్నారుల లాగా ఎక్కువగా సరదాగా ఉండకుండా ఇబ్బంది పడుతుంటారు.
కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలలో సాధారణ మలబద్దక సమస్యలను మనం సింపుల్ గా పరిష్కరించవచ్చు.
మీరు చేయాల్సిందల్లా………..
మలబద్ధకం సమస్య ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం.. 8-10 ఎండుద్రాక్షలను 2 టేబుల్ స్పూన్ల వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత అదే నీటిలో వాటిని పిండి పై తొక్కను వేరు చేసి పిల్లలకు ఆ రసం తాగించాలి.
అల్లం, పీచు ఎక్కువగా ఉండే బీరకాయ లాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య తీరుతుంది.
అరటి మలబద్ధకం సమస్యకు మెడిసిన్ గా పనిచేస్తుంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక అరటిపండు ఇవ్వండి. ఇది మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను అధికంగా ఇవ్వాలి. ఈ రకమైన కూరగాయలు మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.
నీరు ఎక్కువ తాగడం వలన మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. మలబద్ధకం ఉన్నప్పుడు, ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవడం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. దీంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా రావు.



Next Story