మొసళ్ళకు ఝలక్ ఇచ్చిన కోడి.. వీడియో వైరల్

by  |
మొసళ్ళకు ఝలక్ ఇచ్చిన కోడి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సింహం పడుకుంది కదా అని జూలు తో జడ వేయకూడదురోయ్ ఇది ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. ప్రస్తుతం ఈ డైలాగ్ నే ఒక కోడి కాపీ కొట్టింది. చిన్న కోడినే కదా అని తినడానికి ట్రై చేయకూడదురోయ్ అంటూ మొసలికి సవాల్ విసిరింది. అసలు ఈ కోడి- మొసలి కథ ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో సముద్ర ఒడ్డున మొసలి సేద తీరుతుంటే దానిపై ఒక కోడి నడుచుకుంటూ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఒడ్డుకు చేరానుగా అనుకున్న కోడి హాయిగా వెళ్లిపోవడానికి రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి కోడిని పట్టుకోవడానికి నోరు తెరిచింది. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న కోడి ఒక్కసారిగా ఎగిరి మొసలికి అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. దీంతో మొసలి ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. కోడిని పట్టుకోవడానికి మరో మొసలి వెనక నుండి మాటు వేస్తుంది. ఈ రెండు మొసళ్ళకు కోడి ఝలక్ ఇచ్చి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కోడే కదా అని తినడానికి ట్రై చేయకూడదురోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed