- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈ అన్యాయం మరెవరికీ జరుగొద్దు’
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. కూతురు తక్కువ కులం వ్యక్తిని వివాహం చేసుకుందున్న కారణంగా యువతి తండ్రి కిరాతకంగా హేమంత్ అనే యువకుడ్ని హత్య చేయించాడు. దీనిపై హేమంత్ సోదరుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ… మా అన్నకు జరిగిన అన్యాయం ఎవరికీ, మరోసారి జరుగొద్దు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి అవంతి బంధువులు తమను బెదిరిస్తున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా మమ్మల్ని బెదిరించారని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. కూతురు తక్కువ కులం వ్యక్తిని వివాహం చేసుకుందున్న కారణంగా యువతి తండ్రి కిరాతకంగా హేమంత్ అనే యువకుడ్ని హత్య చేయించాడు. దీనిపై హేమంత్ సోదరుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ… మా అన్నకు జరిగిన అన్యాయం ఎవరికీ, మరోసారి జరుగొద్దు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి అవంతి బంధువులు తమను బెదిరిస్తున్నారని అన్నారు.
పోలీస్ స్టేషన్‌లో కూడా మమ్మల్ని బెదిరించారని అన్నారు. వాళ్లే మారుతారు… వదిలేద్దాం అని ఇంతకాలం అవంతి తమతో చెబుతూ.. వచ్చిందన్నారు. మా అన్నను చిత్రహింసలకు గురిచేసి అవంతి కుటుంబసభ్యులే చంపారని వెల్లడించారు. ఈ హత్యకేసులో నిందితుల నోటితోనే మీడియాకు నిజాలు చెప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు కాలయాపన చేయకుండా మా కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు.






