పేదల ఆకలి ఎలా తీరుస్తున్నానంటే : సీతక్క

by  |
seetakka 1
X

దిశ, మంగపేట : కరోనా మహమ్మారి వలన విధించిన లాక్‌డౌన్ సమయంలోనూ, సెకండ్ వేవ్‌లోనూ పేదల ఆకలి ఎలా తీరుస్తూ వచ్చానో ఆమె వివరించారు. దాతలు ముందుకొచ్చి తనకు సహకారం అందించడం వల్లే పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. ఆదివారం తాడ్వాయి మండలం జనగలంచ గిరిజనులకు హన్మకొండకు చెందిన ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ సహాకారంతో సుమారు రూ. లక్ష విలువ గల నిత్యావసర సరుకులను 60 కుటుంబాలకు అందజేసినట్లు పేర్కొన్నారు. నెలకు సరిపడా నిత్యావసరాలు బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు, పండ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి పేదవారి ఆకలి తీర్చేందుకు తనకు సహాకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed