- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి స్పెషల్.. తెలంగాణలోని ఆ టెంపుల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు..
<p>దిశ, వేములవాడ : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం వరకు గగన విహారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు ఆర్.అంజయ్య, బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ హెలిప్యాడ్ సేవలను ప్రారంభించారు. అనంతరం వీరంతా హెలికాప్టర్‌లో ప్రయాణించి ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను వీక్షించారు. ఛార్జీల వివరాలు.. వేములవాడ నుండి నాంపల్లి […]</p>

X
దిశ, వేములవాడ : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం వరకు గగన విహారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు ఆర్.అంజయ్య, బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ హెలిప్యాడ్ సేవలను ప్రారంభించారు. అనంతరం వీరంతా హెలికాప్టర్‌లో ప్రయాణించి ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను వీక్షించారు.
ఛార్జీల వివరాలు..
వేములవాడ నుండి నాంపల్లి గుట్ట వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణానికి ఒకరికి రూ.3 వేలు చొప్పున టిక్కెట్‌ను వసూలు చేయనున్నారు. వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్య మానేరు డ్యామ్ అందాలు వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల గగనతల ప్రయాణానికి ఒక్కరికి రూ. 5,500 వసూలు చేయనున్నారు.
Next Story






