ఈ సారి అత్యధిక వర్షపాతం.. మరో రెండు రోజులు వర్షాలే

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాదితో పోల్చితే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. నైరుతి సీజన్​ లో రాజన్న సిరిసిల్లా జిల్లాలో అత్యధికంగా 1413.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 81 శాతం అధికంగా కురిసినట్లు స్టేట్​ డెవలప్​మెంట్​ ప్లానింగ్​ సొసైటీ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని 130 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవ్వగా, 21 జిల్లాల్లోని 266 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా రికార్డు అయినట్లు స్టేట్​ ప్లానింగ్​ సొసైటీ రిపోర్టులో పొందుపరిచారు. సాధారణంగా జూన్​ 1 నుంచి అక్టోబరు 16 వరకు ఉండే నైరుతి రుతుపవనాల సీజన్​లో సగటు వర్షపాతం 784.3 మి.మీ ఉండగా, గతేడాది 2020–21న 1211.6 మి.మీ కురిసింది. కానీ ఈ సారి అక్టోబరు 16 నాటికే 1047.6 మి.మీ వర్షం కురవడం గమనార్హం. అంటే గతంతో పోల్చితే ఈ సారి 34 శాతం అధనంగా వర్షాలు పడ్డాయని ప్లానింగ్​ సొసైటీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నైరుతి సీజన్​ లో ఇలా..

నైరుతి రుతుపవనాల సీజన్​లో అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 1413.7 మి.మీ(81శాతం) నమోదవ్వగా, ఆ తర్వాత సిద్దిపేట​ జిల్లాలో 1177.9 మి.మీ, వరంగల్​ అర్బన్​లో 1281.1 మి.మీ, కరీంనగర్​ లో 1246.2 మి.మీ, నారాయణపేట్​ జిల్లాలో 793.2 మి.మీ వర్షపాతం కురిసింది. ఈ ఐదు జిల్లాల్లోని 130 మండలాల్లో సాధారణం కంటే 60 శాతం ఎక్కువ వర్షాలు పడ్డట్లు ప్లానింగ్​ సోసైటీ వివరించింది. అదే విధంగా నిజామాబాద్​ లో 1426.0 మి.మీ, వరంగల్​ రూరల్​ లో 1290.9మి.మీ ,రంగారెడ్డిలో 831.5 మి.మీ, నిర్మల్​ లో 1437 మి.మీ, జనగామలో 1043.1మి.మీ, భువనగిరిలో 880.6మి.మీ, జగిత్యాలలో 1278.5 మి.మీ, కామారెడ్డిలో 1254.6 మి.మీ, మహబూబ్​నగర్​ లో 765.5మి.మీ, మహబూబాబాద్​ లో 1148.4మి.మీ, ఆదిలాబాద్​ లో 1428.5మి.మీ, మేడ్చల్​ లో 834.9 మి.మీ, హైదరాబాద్​ లో 832.5 మి.మీ, నల్గొండలో 762.3 మి.మీ, కొమురం భీం జిల్లాలో 1408.6 మి.మీ, వికారాబాద్​ లో 906.3 మి.మీ, కొత్తగూడెంలో 1240 మి.మీ, మెదక్​ లో 997.4 మి.మీ, వనపర్తిలో 614.9 మి.మీ ,జయశంకర్​ భూపాలపల్లిలో 1194.7 మి.మీ, ఖమ్మంలో 1056.9 మి.మీ వర్షపాతం రికార్డు అయింది. ఈ జిల్లాల్లో సాధారణంతో పోల్చితే 20 నుంచి 59 శాతం వర్షాలు ఎక్కువగా పడ్డాయి.

మరో రెండు రోజులు వానలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ నైరుతి సీజన్​ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురిశాయి.

Next Story

Most Viewed