తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు

by  |
తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు
X

దిశ, వెబ్‎డెస్క్: ‎తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చెన్నై, మధురై, కాంచీపురం, తిరువళ్లూరు, తూత్తుకూడి జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.

చెన్నైలో కురుస్తున్న వర్షాలకు చెంబరం పాకం రిజర్వాయర్ నిండిపోయింది. ఇక తూత్తుకూడి జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు తెగిపోయాయి.

Next Story

Most Viewed