- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ.. ఉభయగోదావరి జిల్లాల్లోనూ, కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ.. ఉభయగోదావరి జిల్లాల్లోనూ, కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 26 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Next Story






