పోటెత్తిన వాన.. ముంచెత్తిన వరద

by  |
పోటెత్తిన వాన.. ముంచెత్తిన వరద
X

దిశ, వెబ్ డెస్క్:
నిన్నటి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం అతలా కుతలం అవుతోంది. కుండపోత వర్షాలకు నగర ప్రజలు విలవిల లాడి పోతున్నారు. వర్షం ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలంగా వీస్తున్న గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ కు అంతరాయం కలిగింది. కాగా వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కంట్రోల్ రూం కు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తూ వారికి అధికారులు అందుబాటులో ఉంటున్నారు.

కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృద్దులు, పిల్లలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక నగరంలో మూసీ నది పొంగి పొర్లుతోంది. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వంటి ప్రాంతాల్లో బ్రిడ్జిల వద్ద పోలీసులు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇక హిమాయత్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. అందులో జలమట్టం క్రమంగా పెరుగుతోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1762.176 అడుగులు. కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 1762.176లకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.


Next Story

Most Viewed